AP: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అనకాపల్లికి చెందిన దంపతులు గంట్యాడలో ఓ ఫంక్షన్కు వెళ్లారు. అక్కడ రవి అనే వ్యక్తి బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న చిన్నారి కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. నిందితుడికి బెయిల్ కోసం లాయర్లు ముందుకు రావద్దని కోరారు.