NTR: ఏ కొండూరు మండలం గోపాలపురం జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.