TG: గంజాయి స్మగ్లర్లు రోజురోజుకు కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏకంగా పుష్ప మూవీనే మించేలా రెచ్చిపోతున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా అనంత్సాగర్ వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఓ ట్రాక్టర్ పట్టుబడింది. దీనిని తనిఖీ చేయగా ట్రాలీ కింద స్పెషల్గా తయారుచేసిన అరలో 338కిలోల గంజాయిని చూసి పోలీసులు కంగుతిన్నారు. దీనిని ఒడిశా నుంచి కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.