»Ysrcp Leaders Distributing Cash And Silver Coins For Mlc Elections
YSRCP బరి తెగింపు.. వెండి నాణేలు, ఓటుకు 5 వేలు.. గూగుల్, ఫోన్ పే
ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకులతో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వాలంటీర్లు అయితే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పార్టీ కోసం పని చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లకు తాయిళాలు పంచుతూ కూర్చుంది. ఇదంతా బహిరంగంగా చేస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం చూస్తూ ఉండిపోయింది.
శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) బరి తెగించింది. ఓటింగ్ వేళ స్వయంగా మంత్రులు (Ministers), ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు బహిరంగంగా నగదు (Cash Distribution) పంపిణీ చేపట్టారు. ఒక్క ఓటుకు రూ.5 వేలు ఇవ్వగా.. మరికొందరు ఓటర్లకు వెండి నాణేలు (Silver Coins) తదితర కానుకలు అందిస్తూ రెడ్ హ్యాండెడ్ (Red Handed) గా పంపిణీ చేశారు. ఇక దొంగ ఓట్లు భారీగా వేయించారు. దొంగ ఓట్లు (Bogus Votes) వేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనికోసం ఆటో డ్రైవర్ల (Auto Drivers)తో సంప్రదింపులు చేశారు. ఆటో సంఘంలోని కార్మికులకు వైఎస్సార్ సీపీ నాయకులు వాట్సప్ లో సందేశాలు పంపించారు. తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ రామారావు (RamaRao) అనే వ్యక్తి ఆటో డ్రైవర్ ను బెదిరిస్తూ వాయిస్ మెసేజ్ లు పంపారు. ప్రభుత్వ ఉద్యోగులు (Govt Teachers), యూనివర్సిటీ అధ్యాపకులతో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వాలంటీర్లు (Volunteers) అయితే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పార్టీ కోసం పని చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా అధికార పార్టీ నిబంధనలు (Rules) ఉల్లంఘిస్తూ ఓటర్లకు తాయిళాలు పంచుతూ కూర్చుంది. ఇదంతా బహిరంగంగా చేస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం (Election Commission) చూస్తూ ఉండిపోయింది. వైఎస్సార్ సీపీ బరితెగింపుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగనుంది. మూడు పట్టభద్రుల (Graduate MLC Election), రెండు టీచర్ (Teacher’s MLC Election), నాలుగు స్థానిక సంస్థల (Local Body MLC Election) ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఒక రోజు ఉందనగా అధికార పార్టీ వైఎస్సార్ సీపీ రెచ్చిపోయింది. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు అష్టకష్టాలు పడింది. బహిరంగంగా నగదు పంపిణీకి పాల్పడింది. దీనికి తోడు గూగుల్, ఫోన్ పే తదితర యూపీఏ పేమెంట్లు కూడా చేర్పించింది. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకు రూ.వెయ్యి, ఉపాధ్యాయ ఓటుకు రూ. 5 వేల చొప్పున ముట్టజెప్పారు. అనంతపురము జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ (KV Ushashri Charan) ఏకంగా తన కార్యాలయంలోనే నగదు చెల్లింపుపై సమీక్ష నిర్వహించారు.
అధికార పార్టీ బరితెగింపు మచ్చుకు కొన్ని
– విశాఖపట్టణం హెచ్ బీ కాలనీలో వైఎస్సార్ సీపీ ఎంపీకి చెందిన నిర్మాణ సంస్థలో పని చేసే ఈశ్వరరావు అనే వ్యక్తి డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిపోయాడు. రూ.83 వేల నగదును అతడి వద్ద దొరికింది.
– విశాఖ 40వ వార్డు ఏకీసీ కాలనీలో అర్బన్ క్లినిక్ వద్ద కార్పొరేటర్ గుండు నాగేశ్వరరావు పట్టాలను పంపిణీ చేశాడు.
– విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజాప్రతినిధులు నేరుగా ఓట్ల కొనుగోలు వ్యవహారాలు నడిపించారు.
– ప్రకాశం జిల్లాలో ఫోన్ పే ద్వారా ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు.
– నెల్లూరు జిల్లాలో కూడా యూపీఏ ద్వారా పేమెంట్లు జరిపారు. ఈ వ్యవహారంపై సీపీఎం నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
-పలమనేరు, సత్యవేడు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో కూడా ఓటుకు రూ.5 వేలు చెల్లించారు.
– బాపట్ల జిల్లాలో వెండి నాణేలు పంపిణీ చేశారు. నాణేనికి ఒకవైపు బీకేసీ మరోవైపు దేవతల చిత్రాలు ఉన్నాయి. ఆ నాణేం సుమారు 12 గ్రాముల బరువు ఉంది.
– చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వాలంటీర్లు యథేచ్చగా వైఎస్సార్ సీపీకి పనులు చేస్తున్నారు. పార్టీకి మద్దతు ప్రచారం చేయడంతో మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఒకవైపు బోగస్ ఓట్లు…మరో వైపు ఓట్ల కొనుగోలు… ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటమి భయం తో ఇదీ వైసీపీ ఎంచుకున్న విధానం! ఓటర్లు చైతన్యంతో వ్యవహరించి వైసీపీకి బుద్ది చెప్పాలని కోరుతున్నా.(1/2) pic.twitter.com/d51MbccYMU
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుకు పంచడానికి వెండినాణాలు సిద్దం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్.నివాసంలో పంపిణీకి సిద్దంగా వుంచినట్లు ఆరోపణలు. విషయాన్ని తెలుసుకుని చేరుకున్న పిడిఎఫ్,టిడిపి వర్గాలు. #JaganFailedCM#VoteforTDPMLCCandidatespic.twitter.com/YdumLog00p
— Vempati Praveen(వేంపాటి ప్రవీణ్) (@VempatiOfficial) March 10, 2023