»We Have Built A Hospital In Suryapet With Rs 156 Crores Cm Kcr
Cm Kcr: జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు: సీఎం కేసీఆర్
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. జీరో ఫ్లోరోసిస్ స్టేట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు.
తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (Cm Kcr) నేడు సూర్యపేట (Suryapeta)లో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆయన ప్రారంభోత్సవం నిర్వహించారు. ఆ వైద్య కళాశాలను రూ.156 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు తెలిపారు. పట్టణంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ను, శాకాహార, మాంసాహార మార్కెట్‌ను రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు.
సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లు తెలిపారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉందని, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ (Cm Kcr) సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ప్రారంభోత్సవం నిర్వహించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గిపోయాయని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో పస్తులు ఉండే పరిస్థితి లేదని, ఒకప్పుడు ఫ్లోరైడ్‌తో విలవిల్లాడిన రాష్ట్రం ఇప్పుడు జీరో ఫ్లోరోసిస్ స్టేట్‌గా మారిందని తెలిపారు.