»Us Intel Fears Threats To India From China And Pakistan
US intelligence: పాక్, చైనా నుండి ప్రమాదం, భారత్ చూస్తూ ఊరుకోదన్న అమెరికా ఇంటెలిజెన్స్
చైనా ( china ) , పాకిస్తాన్ ( pakistan ) దేశాల నుండి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని ( threats to India ) , అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ( Narendra Modi leadership ) ఆ దేశం ధీటుగా ఎదుర్కొంటుందని , చూస్తూ ఊరుకోదని తాజా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ( US intelligence ) వెల్లడించింది .
చైనా ( china ) , పాకిస్తాన్ ( pakistan ) దేశాల నుండి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని ( threats to India ) , అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ( Narendra Modi leadership ) ఆ దేశం ధీటుగా ఎదుర్కొంటుందని , చూస్తూ ఊరుకోదని తాజా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ( US intelligence ) వెల్లడించింది . యూఎస్ కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో భాగంగా షాకింగ్ అంశాలను తెలిపింది . సరిహద్దు ఉద్రిక్తల పైన మోడీ నాయకత్వంలో గతంలో కంటే ధీటుగా సైనిక శక్తితో ప్రతిస్పందించగలదని ( US Intelligence annual assessment ) అభిప్రాయపడింది . భారత్ – పాకిస్తాన్ ( India – Pakistan ), భారత్ – చైనా ( India – China ) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఘర్షణలకు అవకాశం ఉందని అంచనా వేసింది . సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్ , చైనా ద్వైపాక్షిక చర్చలు ( India and China’s relations ) జరుపుతున్నాయని , కానీ 2020లో జరిగిన గాల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపింది . సరిహద్దు వద్ద పెరిగిన సైనిక మోహరింపులు ఈ అణుశక్తి కలిగిన దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పెంచుతున్నట్లు తెలిపింది . ఇది అమెరికా ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది .
ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని ఇంటెలిజెన్స్ నివేదికలో వెల్లడించింది . గతంలోని సంక్షోభ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే వాస్తవాదీన రేఖ వద్ద ( Line of Actual Control – LAC ) స్వల్పస్థాయి అకస్మిక ఘర్షణలకు అవకాశం ఉండవచ్చునని తెలిపింది . 2020 నుండి భారత్ – చైనా మధ్య సంబంధాలు ( India-China dispute ) అంతగా లేవని ఈ నివేదిక పేర్కొన్నది . గాల్వాన్ తర్వాత ( Galwan Clash ) అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ( arunachal pradesh tawang ) వద్ద చైనా చొరబాటుకు ప్రయత్నించిందని , ఇది మరింత ఘర్షణకు దారి తీసిందని తెలిపింది .
ఈ నివేదికలో ( Report ) భారత్ – పాకిస్తాన్ మధ్య సంబంధాల పైన కూడా పేర్కొన్నారు . ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల పైన ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా ఇంటెలిజెన్స్ . భారత్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూప్ కు ( extremist groups ) మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్తాన్ ( Pakistan ) కు ఉందని గుర్తు చేసింది . పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు గతంలో కంటే ప్రస్తుత మోడీ నాయకత్వంలోని భారత సైన్యం ( Indian Army ) ధీటుగా సమాధానం ఇస్తోందని తెలిపింది . భారత్ పైన ఉగ్రదాడి లేదా హింసాత్మక దాడి జరిగితే పాకిస్తాన్ పైన మోడీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయాన్ని కలిగించిందని అందులో తెలిపింది . కాశ్మీర్ ( Kashmir ) అంశం ఉద్రిక్తతలను పెంచుతున్నట్లు తెలిపింది . 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణ ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది .