»Three Dead Five Injured After Three Storey Building Collapses In Vizag
Building Collapsed: కుప్పకూలిన భవనం, బర్త్ డే తర్వాత గంటల్లోనే.. మృతి
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృతి (Three dead) చెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Visakhapatnam building collapse). ప్రమాదంలో శిథిలాల కింద పడి పద్నాలుగేళ్ల బాలిక అంజలి (Anjali), పదిహేడేళ్ల ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ (Durga Prasad) కన్నుమూశారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి (five injured after three storey building collapses in Vizag). ఆ తర్వాత రెస్క్యూ టీమ్ బీహార్ కు (Bihar) చెందిన 27 ఏళ్ల చోటు మృతదేహాన్ని వెలికితీశారు. గాయపడిన వారిలో శివశంకర, రామారావు, కళ్యాణి, కృష్ణ, రోజారాణి ఉన్నారు.
మూడంతస్తుల భవనం కుప్పకూలిన సమాచారం అందుకోగానే పోలీసులు (police), అగ్నిమాపక (fire engine), ఎన్డీఆర్ఎఫ్ (N D R F), రెవెన్యూ, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు (Hospital) తరలించారు. ఇద్దరికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్సను (Emergency Care) అందిస్తున్నారు. బీమిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదం జరగడంతో తమకు ఏమీ తెలియలేదని గాయపడిన వారు చెబుతున్నారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అంజలి బుధవారం రాత్రి తన పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపిన కొద్ది గంటల్లోనే భవనం కుప్పకూలి అంజలి, ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ కన్నుమూయడంతో అందరు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరి తల్లిదండ్రులు రామారావు, కళ్యాణిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.