»Threatening Messages To Cricketer Yavraj Singhs Mother Demand To Give 40 Lakhs
Yavraj Singh: యువరాజ్ తల్లికి బెదిరింపులు రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్
యువరాజ్ సింగ్ కుటుంబానికి బెదిరింపు ఎదురయ్యాయి. గతంలో తమ ఇంట్లో పని చేసిన ఓ మహిళ 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Threatening messages to cricketer Yavraj Singh's mother. Demand to give 40 lakhs
Yavraj Singh: మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్(Yavraj Singh) సింగ్ కుటుంబానికి బెదిరింపు మెసేజ్‌లు(Threatening messages) వస్తున్నాయి. నలభై లక్షల రూపాయలు ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో పెట్టి కుటుంబం పరువు తీస్తానంటు యూవీ తల్లిని ఓ మహిళ బెదిరించింది. గతంలో తమ కుటుంబంలో పని చేసిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్ సింగ్(Zoraveer Singh) కొన్నేళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం ఉండడంతో వైద్యుల సలహా మేరకు తనను చూసుకోవడానికి సహాయకురాలిగా పని చేసేందుకు యువీ తల్లి షబ్నం గతేడాది హేమా కౌశిక్(Hema Kaushik) అనే మహిళను నియమించింది. కానీ తన ప్రవర్తన నచ్చకపోవడంతో పని నుంచి తొలగలించింది.
బెడ్ రెస్ట్ లో ఉన్న జోరవీర్ సింగ్ ను చూసుకోవడానికి వచ్చిన మహిళ తీరు బాగలేకపోవడంతో పనిలో పెట్టుకున్న 20 రోజుల్లోనే తనను తొలగించింది షబ్నం. అప్పటికే ఆమె చేసిన సర్వీస్‌కు డబ్బులు కూడా చెల్లించింది. తన స్థానంలో మరో వ్యక్తిని నియమించున్నారు. అయితే ఈ ఏడాది మే నుంచి యువీ తల్లికి హేమ వాట్సప్‌లో మెసేజ్ లు చేస్తూ బెదిరిస్తోంది. రూ. 40 లక్షలు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టి కుటుంబం పరువు తీస్తానంటూ యువీ తల్లికి మేసేజులు పంపిస్తుంది. దీనిపై యువరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గురుగ్రామ్ పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. అత్యాశతోనే ఇలా చేసిందా లేదా ఈమె వెనుక ఎవరు ఉన్నారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.