»The Weather Has Changed In Mumbai Rain Chances In Mumbai Pune Districts
Mumbai:లో మారిన వాతావరణం..పలు జిల్లాల్లో వర్షాలు!
దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ముంబయి, పూణే, అహ్మద్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర( Maharashtra )లోని ముంబయి, పూణే, అహ్మద్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ ప్రభావం మధ్యాహ్నం వరకు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దీంతోపాటు పాటు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో బయటికి వెళ్లేటప్పుడు ప్రజలు(people) జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అంతేకాదు ఇప్పటికే గత రెండు రోజులుగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన అకాల వర్షాలు(rains) కురిశాయి. అయితే హోలీ(holi) పండుగకు ముందే ఇలా వర్షాలు కురవడం పట్ల అక్కడి వారు కొంత మంది సంతోషం వ్యక్తం చేస్తుండగా..మరికొంత మంది వర్షం కారణంగా ఏర్పడిన ఇబ్బందులతో అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు(people) వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మరోవైపు ముంబయి(Mumbai)లో సముద్రం తీరం ఉన్న నేపథ్యంలో ఆయా తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.