»The Couple Died On The First Night If You Know The Reason You Will Be Shocked Up
First night: రోజే దంపతులు మృతి..కారణం తెలిస్తే షాక్ అవుతారు
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్(uttar pradesh) రాష్ట్రంలో కొత్తగా పెళ్లయిన దంపతులు ఫస్ట్ నైట్ రోజు తర్వాత తెల్లవారుజామున చూసేసరికి గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి(couple died)చెంది ఉన్నారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు గదిలోకి ప్రవేశించిన తర్వాత దంపతులు ప్రతాప్ యాదవ్ (24), అతని భార్య పుష్ప యాదవ్ (22) శరీరంపై గాయపడిన గుర్తులు ఎలాంటివి కనిపించలేదని పేర్కొన్నారు. ఈ మరణాలలో నేర కోణం లేదని సూచించినప్పటికీ, అదే సమయంలో దానికి ముందు నాడు ఏం తిన్నారో కూడా తెలుసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఫోరెన్సిక్ నిపుణుల బృందం వారి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి గది పరిస్థితులను పరిశీలించిందని కైసర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
దంపతుల మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకీ పోలీసులు మృతదేహాలను పంపించారు. ఇద్దరి మృతదేహాల పోస్ట్‌మార్టం నివేదికలో ఇద్దరూ గుండెపోటు కారణంగా మరణించారని నిర్ధారించారు. అయితే ఈ జంటకు గతంలో గుండె సంబంధిత సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుండెపోటుకు దారితీసిన కారణాల్లో వారు వెంటిలేషన్ రాకుండా ఉన్న గదిలో నిద్రిస్తున్న క్రమంలో ఊపిరాడకుండా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.