Ramana Dikshitulu: తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కేసు నమోదు అయింది. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఐటీ విభాగం జీఎం కేసు పెట్టారు. టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని రమణ దీక్షితులు అంటున్నారు.