పై చదువలు కోసం విదేశాలకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నెల రోజుల తరువాత బాడీని స్వదేశానికి తీసుకొస్తుండటం విశేషం.
A Telugu student died in a road accident in London
London: ప్రమాదం ఎటునుంచి పొంచి ఉన్నదో ఎవరికి తెలియదు. రోడ్డుపై ప్రయాణం(road Travel ) చేసేవారు గమ్యం చేరేంత వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లే లెక్క. కొన్ని సార్లు మనం సవ్యం గానే వెళ్లినా కూడా అవతలి వ్యక్తి మూలంగా ప్రమదానికి గురయ్యే పరిస్థితి. అలాంటి సంఘటనే లండన్(London)లో ఓ తెలుగు కుర్రాడికి ఎదురైంది. ఈ ఘటనలో మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఆరాధ్యుల కిరణ్‌కుమార్ అనుకొని ప్రమాదంతో తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగిల్చాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్‌కుమార్ తపాలా శాఖలో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు కిరణ్‌కుమార్(25) ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రెండున్నరేళ్ల కిందట లండన్ వెళ్లి ఎంఎస్ కూడా పూర్తి చేసుకున్నారు. మంచి ఉద్యోగం కోసం ఇతర కోర్సులలో శిక్షణ తీసుకుంటున్నాడు. తాను ఉండే రూమ్ నుంచి ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రతిరోజు తన బైక్‌పై వెళ్తుంటాడు. అలానే జూన్ 26న తన బండిపై తరగతికి హాజరవడానికి వెళ్తుండగా… అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ..(road accident) కిరణ్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నెల రోెజుల తరువాత ప్రవాస భారతీయుల సహకారం, కుటుంబ సభ్యుల సాహకారంతో కిరణ్ మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి విమానంలో తరలిస్తున్నారు.