పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు గుండెపోటుతో మృత్యువాత చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డి(30)ని కొన్ని రోజుల క్రితం కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటలకు గుండెపోటు రావడంతో చనిపోయారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి రెండు కిడ్నీలు పాడవటం వల్ల కామెర్లు వచ్చాయని తెలుస్తోంది. ఆ క్రమంలో వైద్యులు అతనికి డయాలసిస్ చేశారు. ఆ నేపథ్యంలోనే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు వచ్చి మరణించారు. ఎమ్మెల్యే కుమారుడు మరణించడంతో బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పటాన్ చెరు నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.