»Tdp To Celebrates Foundation Day In Karimnagar On 29
TDP foundation day: కరీంనగర్లో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సభ
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ (Telangana Hung) అంచనాల నేపథ్యంలో తమ బలం చూపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సభను (TDP foundation day) ప్లాన్ చేసింది.
తెలంగాణలో (Telangana) తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో ఖమ్మం జిల్లాలో (Khammam District) భారీ బహిరంగ సభ (Public Meeting), కాసాని జ్ఞానేశ్వర్ కు (Kasani Gnaneshwar Mudiraj) రాష్ట్ర పార్టీ అధ్యక్ష (Telangana Telugu Desam president) బాధ్యతలు అప్పగించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. వచ్చే ఎన్నికల్లో హంగ్ (Telangana Hung) అంచనాల నేపథ్యంలో తమ బలం చూపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సభను (TDP foundation day) ప్లాన్ చేసింది. ఈ నెల 29వ తేదీన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. జిల్లా పార్టీ నాయకులు కరీంనగర్ లోని (Karimnagar) ఎస్సార్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ ను, అలాగే అంబేడ్కర్ మైదానాన్ని పరిశీలించారు. తొలుత సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సభను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ కంటోన్మెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లో సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని తెలుస్తోంది. వివిధ ప్రాంతాలు పరిశీలిస్తున్నప్పటికీ, సరిగ్గా ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం త్వరలో తేలనుంది.
దాదాపు మూడు నెలల క్రితం ఖమ్మంలో నిర్వహించిన తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party meeting) సభ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు దేశం పార్టీ హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించవచ్చు. కానీ జిల్లాల్లో తక్కువ. పార్టీ అగ్రనాయకత్వం అటు వైపు వెళ్లింది కూడా లేదు. కానీ కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం చంద్రబాబు ఖమ్మం బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ ఉత్సాహంతోనే వచ్చే ఎన్నికల్లో తమకు బలం ఉన్న కొన్ని సీట్లలో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో వచ్చేసారి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చునని, హంగ్ పరిస్థితి ఉంటే, తమకు వచ్చే కొన్ని సీట్ల ద్వారా కూడా చక్రం తిప్పవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.