»Supreme Court New Orders On Palamuru Rangareddy Lift Irrigation Scheme
KCRకు ఢిల్లీ నుంచి అదిరిపోయే గిఫ్ట్.. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) అద్భుత కానుక అందించింది. తాను కలలుగన్న ప్రాజెక్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణంపై వేసిన కేసులపై విచారించిన ధర్మాసనం ప్రాజెక్టు పనులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) అద్భుత కానుక అందించింది. తాను కలలుగన్న ప్రాజెక్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణంపై వేసిన కేసులపై విచారించిన ధర్మాసనం ప్రాజెక్టు పనులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు.
కృష్ణా జలాల (Krishna Water)ను ఒడిసి పట్టి దక్షిణ తెలంగాణ (South Telangana) భూములకు పారించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా కొందరు అడ్డంకులు సృష్టించారు. ఈ ప్రాజెక్టుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ మొదలైంది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోకుండా మానవతా దృక్కోణంతో సుప్రీంకోర్టు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు వీలు కల్పించింది. తాగునీటి అవసరాలకు మాత్రమే ఆ నీటిని వినియోగించుకోవాలని ఆదేశాల్లో స్పష్టంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని వెల్లడించింది.
గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal-NGT) విధించిన రూ.500 కోట్ల జరిమానాపై కూడా అత్యున్నత న్యాయస్థానం స్టే (Stay Orders) విధించడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసు విచారణను ఆగస్టు (August) కు వాయిదా వేసింది. పాలమూరు-రంగారెడ్డిపై ఆది నుంచి అడ్డంకులు వస్తున్నాయి. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న క్రమంలోనే కొందరు వ్యక్తులతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతోపాటు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను కూడా ఆశ్రయించారు. వారి ఫిర్యాదును స్వీకరించిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి రూ.528 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజల అవసరాల దృష్ట్యా సుప్రీంకోర్టు జరిమానాపై స్టే విధించడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెంపపెట్టులాంటిది అని పేర్కొన్నారు.