»Kcr Birthday Kalvakuntla Kavitha Prayers In Balkampet Yellamma Temple
Balkampet ఎల్లమ్మకు బంగారు నగలు ఇచ్చిన కవిత
కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మొత్తం కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగాయి. ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులకు పండ్లు పంపిణీ చేపట్టారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానం చేశారు. కొంత మంది రక్తదానం చేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున సాయంత్రం పెద్ద ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమం చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం (KCR Birthday Celebrations) సందర్భంగా కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రెండు రోజులుగా బిజీబిజీగా ఉన్నారు. వరుసగా తన తండ్రి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదిన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొంటున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత కూడా వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కేసీఆర్ 69వ పుట్టిన రోజు శుక్రవారం జరుపుకుంటుండడంతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ (Hyderabad)లోని బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా తయార చేయించిన బంగారు ఆభరణాలు సమర్పించారు. అనంతరం గర్భ గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. అంతకుముందు కవితకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో రాజశ్యామల పూజ కవిత చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. బల్కంపేట అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని కవిత తెలిపారు.
అంతకుముందు కేసీఆర్ జన్మదినోత్సవాల్లో భాగంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో గురువారం కేసీఆర్ కప్ (KCR Cup) వాలీబాల్ టోర్నమెంట్ (Volleyball Tournament) నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం బాలబాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అర్థరాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో ముఖ్య అతిథిగా కవిత హాజరయ్యారు. పోటీలను ఆసాంతం తిలకించారు. ఫైనల్ పోరు ఉత్కంఠగా సాగింది. అనంతరం విజేతలకు కవిత ట్రోఫీ, నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించి వారితో ఫొటోలు దిగారు. అనంతరం అర్ధరాత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కవిత కేక్ కట్ చేసి ఇతరులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
చదవండి: తెలంగాణకు భూమి దానం ఇచ్చిన భారత క్రికెటర్ అంబటి రాయుడు
కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మొత్తం కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగాయి. ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులకు పండ్లు పంపిణీ చేపట్టారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానం చేశారు. కొంత మంది రక్తదానం చేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున సాయంత్రం పెద్ద ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమం చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మంత్రులు, ఎమ్మెల్యే లు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. కాగా సీఎం కేసీఆర్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.