కొత్త చిత్రనిర్మాత జై కుమార్ సైబర్ వార్ చుట్టూ తిరిగే ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయిన కోకో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గింప్స్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ ఈరోజు రిలీజ్ చేశారు.
దేశంలో ఫస్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కోకో(KOKO) రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మూవీ గింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ వీడియోను ప్రముఖ దర్శకుడు సుకుమార్(sukumar) విడుదల చేశారు. సందీప్ రెడ్డి వాసా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కోకో మూవీ ఫ్యూచర్ వార్ సైబర్’ అనే కథాంశంతో రాబోతుంది. పాక్, చైనా-మద్దతు గల హ్యాకర్ల సమూహం భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్-గూఢచర్యం ముప్పు వంటి సవాళ్లను ఈ చిత్రంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
నిష్ణాతులైన బ్లాక్ హ్యాట్ హ్యాకర్ నిక్కీ తన ఫ్యామిలీకి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన తండ్రి రామానుజన్ కోరికను అమలు చేయడానికి “KOKO” అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. KOKO తనకు కావలసిన ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును ఉపయోగించి దాని కార్యకలాపాలను అమలు చేస్తుంది. కానీ అది భౌతికంగా కనిపించదు. భారత రక్షణ వ్యవస్థకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు అసాధారణమైన RAM-ISU (వేగం, ఖచ్చితత్వం, శక్తిని నిర్వచించే రామ్ బాణం)ను కోడ్ చేయడం ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను రామానుజన్ కనుగొన్నారు. కొత్త యుగం సమస్యకు పరిష్కారం ప్రాచీన భారతదేశ గ్రంథాలలో ఉందని ఈ చిత్రం చూపిస్తుంది.
అత్యంత శక్తివంతమైన చైనీస్ హ్యాకర్ భారతదేశంపై సైబర్ యుద్ధాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. మరోవైపు కోకో చిత్రంలో శత్రువుల మధ్య పోరాటాన్ని చూపే మలుపులు కూడా ఈ చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందనున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ మూడో వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. వియత్నాం, లడఖ్, చైనా, కేరళ, హైదరాబాద్‌లలో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఇది 2024 వేసవిలో పాన్ ఇండియా(pan india) లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, వియత్నామీస్, తైవాన్ భాషల్లో విడుదల కానుంది.