KMR: జుక్కల్ మండల కేంద్రంలోని బీటీ రోడ్డు వేసి మొరం వేయలేదని గుత్తేదారుపై జీపీలో వార్డు సభ్యుడు విఠల్ ఫిర్యాదు చేశారు. ఈ బీటీ రోడ్డు దోస్త్ పల్లి చౌరస్తా నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం ఇంటి వరకు వేశారు. మొరం వేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు.