మహారాష్ట్రలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పూణే పోలీసులు వ్యభిచార దందా నడుపుతున్న గ్రూప్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడిలో ఓ భోజ్‌పురి నటితో పాటు ఓ మోడల్, ఏజెంట్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫైవ్ స్టార్ హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అలర్ట్ అయ్యారు.
పోలీసు దాడిలో పట్టుబడ్డ నటి, మోడల్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వాకాడ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవెన్ చవాన్ మీడియాకు తెలియజేశారు. ముందుగా పోలీసులు ఆన్ లైన్ ద్వారా ఓ హోటల్ ను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓ డమ్మీ కస్టమర్ ను హోటల్‌కు పంపారు.
నటి, మోడల్ ఫోటోలను సెల్ ఫోన్ ద్వారా వారికి అందిన తర్వాత ఆ హోటల్ పై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(Crime Branch Police) దాడి చేశారు. దాడిలో పట్టుబడిన నటిని, మోడల్‌ను పోలీసులు రక్షించారు. వ్యభిచార దందా నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ప్రబీర్ పి మజుందార్, దినేష్ యాదవ్, విరాజ్ యాదవ్‌లుగా గుర్తించారు.