టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ప్రారంభమైంది. తొలి వన్డే 18న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగ్గా అందులో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా 349 పరుగులు చేసింది. అయితే 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా గెలిచింది.
ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 208 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓ తప్పు చేయడంతో ఐసీసీ జరిమానా విధించింది. ఆ తప్పును కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకోవడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మూడు ఓవర్లు ఆలస్యంగా వేయడంతో ఐసీసీ జరిమానా విధించింది. దీంతో మ్యాచ్ ఫీజులో 60 శాతం నగదును జరిమానాగా టీమిండియా చెల్లించనుంది.