రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు(Harassment) నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ 5 రోజుల పాటు విచారణను చేపట్టి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరోవైపు శ్రీచైతన్య కాలేజీలో అసలు పాటించాల్సిన కనీస ప్రమాణాలతోపాటు రూల్స్ కూడా అతిక్రమిస్తున్నట్లు కమిటీ తెలిపింది. మరోవైపు కళాశాలలో క్లాసులు నిర్వహిస్తున్న విధానాన్ని కూడా పరిశీలించినట్లు చెప్పింది. ఈ క్రమంలో ప్రభుత్వం(telangana Government) శ్రీచైతన్య కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఫిబ్రవరి 28న నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్(letter) రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో కాలేజ్ ప్రిన్సిపల్, ఇంఛార్జీ, లెక్చరర్ పెట్టిన టార్చర్ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ పేర్కొన్నాడు. ఆ క్రమంలో కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక పోయాయని రాసుకొచ్చాడు. ఆ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాలేదు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని సాత్విక్ లెటర్లో వెల్లడించాడు. అంతేకాదు తన హాస్టల్లో(hostel) వీరు ముగ్గురు విద్యార్థులకు టార్చర్ చూపించారని వెల్లడించాడు. ఈ క్రమంలో వారిపై తప్పకుండా యాక్షన్(action) తీసుకోవాలని తన అమ్మను లేఖ(letter)లో కోరాడు.
ఈ కేసులో ఇప్పటికే ఆ నలుగురిని పోలీసులు(police) అరెస్టు (arrest) చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు(family) డిమాండ్ చేశారు. దీంతోపాటు పలు విద్యార్థి సంఘాలు సైతం ఆందోళన (protest) నిర్వహించాయి.