»Sadhguru Shares Benefits Of Consuming Sprouted Fenugreek Seeds
Healthy food tips: ఇవి తింటే మీ జబ్బులన్నీ మాయం అంటున్న సద్గురు!
ఎన్నో ఔషధ గుణాలున్న పప్పులు, కూరగాయలు మన వంటగదిలో దొరుకుతాయి. ఒక్కోసారి ఇందులోని ఔషధ గుణాలు, ఉపయోగం మనకు తెలియవు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు(sadhguru jaggi vasudev) ఈ విషయం గురించి మాట్లాడారు. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన మెంతి గింజలను(fenugreek seeds) తినడం వల్ల అనేక రోగాలు దరిచేరవని వారు తెలిపారు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలి, ఆహారం, పోషకాహార లోపాలు దీనికి కారణం కావచ్చు. దీని వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, నొప్పి, రక్తహీనత వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సద్గురు జగ్గీ వాసుదేవ్(sadhguru jaggi vasudev) ఈ వ్యాధుల నుంచి బయటపడటానికి అద్భుతమైన మార్గాన్ని అందించారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒకదానిలో మెంతి గింజలను(sprouted seeds) నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడారు. మొలకెత్తిన మెంతి గింజలను ప్రతిరోజూ ఉదయం తీసుకోవాలి. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి 50 ఏళ్లు పైబడిన వారికి ఇది చాలా అవసరమని సద్గురు చెప్పారు.
మెంతి గింజల ప్రయోజనాలు:
మొలకెత్తిన మెంతి గింజలు తినడం వల్ల రక్త రుగ్మతలు, ప్రోటీన్ లోపం, విటమిన్లు, ఖనిజాల లోపాలు తగ్గుతాయి. వీటిని తినడం వల్ల పాలిచ్చే తల్లుల కొన్ని సమస్యలు నయమవుతాయి. ఇవి జుట్టు, గోళ్ళ పెరుగుదలకు మంచి ఔషధం. మొలకెత్తిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం తగ్గుతుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా మెంతిపొడి, అల్పాహారం తర్వాత ఒక చెంచా మెంతులు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరం(body)లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు మెంతి గింజలు దివ్యౌషధం. మొలకెత్తిన మెంతులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను తగ్గిస్తాయి.
50 ఏళ్లు పైబడిన వారు
మెంతి గింజలు అన్ని వయసుల వారికి మంచివని, ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు వీటిని తినాలని(eat) సద్గురు చెప్పారు. దీని వినియోగం మెదడు శక్తిని పెంచుతుంది. దీనివల్ల మతిమరుపు, ఆలోచనా శక్తి లేకపోవడం మొదలైన వయసు సంబంధిత వ్యాధులు దరిచేరవు.
ఖాళీ కడుపుతో..
మెంతులు మొలకెత్తిన తర్వాత ఉదయం ఖాళీ కడుపు(empty stomach)తో తీసుకోవాలి. మెంతులు, మెంతి గింజలు తెలివికి పదును పెడతాయి. ఇందులో ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి.
ప్రొటీన్లు పుష్కలం
మెంతి గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతిలో ప్రొటీన్, పీచు, పిండి పదార్థాలు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. కొలెస్ట్రాల్, డయాబెటిస్‌కు ఇది దివ్యౌషధం. దీంతో శరీరంలో మెటబాలిజం కూడా పెరుగుతుంది.