»Raveena Tandon On Broken Engagement To Akshay Kumar
Raveena Tandon: అక్షయ్ కుమార్‌తో బ్రేకప్‌పై 25 ఏళ్ల తర్వాత…
అక్షయ్ కుమార్‌తో రిలేషన్-ఎంగేజ్మెంట్-బ్రేకప్ క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నట్లు పేర్కొన్నది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే అక్షయ్ జీవితం నుండి తాను అప్పుడే బయటకు వచ్చినట్లు చెప్పింది.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) పాతికేళ్ల క్రితం నాటి తన బ్రేకప్ పైన తాజాగా స్పందించింది. నాడు అక్షయ్ కుమార్‌తో (Akshay Kumar) పెళ్లి రద్దయిన క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నట్లు పేర్కొన్నది. నాటి బ్రేకప్ పైన ఆమె మాట్లాడుతూ… దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1994లో తామిద్దరం నటించిన మోహ్రా (Mohra) సినిమా విడుదలైంది. ఈ సినిమా హిట్ కావడంతో తమ జోడీకి మంచి పేరు వచ్చింది. తాము రిలేషన్లో ఉండటం, ఎంగేజ్మెంట్ కావడం… ఆ తర్వాత బ్రేకప్ కావడం కూడా వెంటవెంటనే జరిగిపోయినట్లు తెలిపింది. అక్షయ్ జీవితం నుండి తాను అప్పుడే బయటకు వచ్చినట్లు పేర్కొన్నది. ఆ తర్వాత అక్షయ్ (Akshay Kumar) మరో అమ్మాయిని పెళ్లి చేసుకోగా, తాను మరో వ్యక్తితో రిలేషన్లోకి వచ్చినట్లు గుర్తు చేసుకున్నది. అలాంటప్పుడు తమ మధ్య అసూయకు తావులేదని, తామిద్దరం తరుచూ కలుస్తుంటామని వెల్లడించింది. ఇప్పుడు ఎవరి జీవితాలు వారివి అని తెలిపింది. ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయిందని ప్రశ్నించగా, సరిగ్గా గుర్తుకు లేదని వెల్లడించింది. అయితే ఆ విషయాలు మాత్రం తనకు గుర్తుండి పోయాయని చెప్పింది. అవి ఎందుకు గుర్తున్నాయో తెలియని పేర్కొంది.
అక్షయ్‌తో తన బ్రేకప్ తర్వాత కొద్ది రోజులు పేపర్ చదవడమే మానివేశానని చెప్పింది. మోహ్రా సమయంలో తమది హిట్ ఫెయిర్. ఇప్పుడు కూడా తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని వెల్లడించింది రవీనా టాండన్ (Raveena Tandon). కాలేజీలో అమ్మాయిలు ప్రతివారం తమ బాయ్ ఫ్రెండ్‌ను మారుస్తుంటారని, కానీ తన నిశ్చితార్థం ఇప్పటికీ తనకు గుర్తుకు ఉన్నదని చెప్పింది. జీవితంలో చాలామంది రిలేషన్‌షిప్‌లోకి వస్తారు, బ్రేకప్స్ ఉంటాయి, పెళ్లయ్యాక కూడా విడాకులు ఉంటాయి.. ఇవి పెద్ద విషయాలేమీ కాదని పేర్కొన్నది.
మోహ్రా విజయం తర్వాత రవీనా టాండన్ (Raveena Tandon)- అక్షయ్ కుమార్ (Akshay Kumar) జోడీకి మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో 1995లో రిలేషన్లోకి వెళ్లారు. కొద్ది రోజులకు ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల ముందుకు కదల్లేదు. పెళ్లి వరకు రాకుండానే బ్రేక్ అయింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ 2001లో ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకోగా, రవీనా టాండన్ 2004లో అనిల్ తడానీ అనే బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్నది. రవీనా చివరిసారి యష్ కేజీఎఫ్: చాప్టర్ 2లో (K.G.F: Chapter 2) కనిపించింది.
తనకు కుచ్ కుచ్ హోతాహోలో (Kuch Kuch Hota Hai) అవకాశం వచ్చినప్పటికీ తాను వదులుకున్నట్లు చెప్పింది. దీంతో రాణి ముఖర్జీకి (Rani Mukerji) అవకాశం వచ్చింది. కెరీర్లో అప్పటికే ఎన్నో అలాంటి రోల్స్ చేశాక, మరింత సీరియస్ రోల్స్‌లో పోషించాలని భావించానని, అలాంటి సమయంలో కాజోల్ (Kajol) తర్వాత రెండో హీరోయిన్గా ఉండటం సరికాదని భావించినట్లు తెలిపింది. తాను ఆ సినిమాలో చేయనందుకు గాను కరణ్ ఇప్పటికీ తనను క్షమించడని సరదాగా చెప్పింది. కాజోల్, తాను ఇండస్ట్రీలో సమానంగా ఉన్నామని, అలాంటి సమయంలో సెకండ్ రోల్ పోషిస్తే తనకు మైనస్ అవుతుందని, కానీ రాణీ ముఖర్జీ (Rani Mukerji) కొత్తగా వచ్చింది కాబట్టి, ఆమెకు ప్లస్ అయినట్లు తెలిపింది. ఈ సినిమాలో రాణి ముఖర్జీకి మంచి పేరు వచ్చింది. నటనగా మార్కులు పడ్డాయి.