గత ఏడాది మద్యం విక్రయాలు రంగారెడ్డి జిల్లాలో జోరుగా జరిగాయి. ఆ తర్వాత స్థానం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి దక్కించుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల నుంచి రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది.
Liquor sales:గత ఏడాది మద్యం విక్రయాలు రంగారెడ్డి (ranga reddy) జిల్లాలో జోరుగా జరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్ (hyderabad), మేడ్చల్ మల్కాజిగిరి (medchal) చేరాయి. గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల నుంచి రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ఈ జిల్లాల నుంచే 42 నుంచి 45 శాతం ఇన్కమ్ వచ్చింది.
మద్యం విక్రయాల్లో రంగారెడ్డి (rangareddy) జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. రూ.8436.14 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ (hyderabad) జిల్లాకు రూ.3753.96 కోట్లు.. మేడ్చల్ మల్కాజిగిరి (malkajgiri) జిల్లాకు రూ.1329.78 కోట్ల నగదు వచ్చింది.
గ్రేటర్ పరిధి జిల్లాల నుంచే సింహాభాగం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో చేరింది. రెండేళ్లకోసారి విధించే టెండర్ల ద్వారా కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. మద్యం షాపు కోసం వేసే టెండర్ డిపాజిట్‌ను తిరిగి ఇవ్వరు. దీంతో కూడా భారీగా ఆదాయం వస్తోంది. ఒక్కో షాపుకు ఒకరి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటున్నారు.
నూతన ఎక్సైజ్ పాలసీ మేరకు డిపాజిట్ నగదును ప్రభుత్వం పెంచేసింది. గతంలో రూ.1 లక్ష ఉండేది. దానిని రూ.2 లక్షలకు పెంచింది. అయినప్పటికీ ఆ వైన్ షాపునకు సంబంధించి సిండికెట్ ఏర్పడి.. వారే దక్కించుకుంటారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.