»Electricity Can Be Saved With Cool Roof Minister Ktr
Cool Roof Policy : కూల్ రూఫ్ తో విద్యుత్ ఆదా చేయొచ్చు : మంత్రి కేటీఆర్
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని (Cool Roof Policy) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవిష్కరించారు.
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని (Cool Roof Policy) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో (Hyderabad) ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు.
టీఎస్ బీపాస్‌తో (TS Bpass) దేశంలో ఎక్కడాలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. హరితహారం (Haritha Haram) కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కూల్ రూప్(Cool Roof) ఉపయోగపడుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉష్ణోగ్రత (temperature)పెరగడం వల్ల ఇళ్లు, ఆఫీసులు, వాణిజ్య భవనాలలో కరెంట్ వాడకం పెరిగిపోతుందని చెప్పారు. దీంతో కరెంట్ బిల్లు (Current Bill) భారీగా వస్తుందని వివరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించడంకోసం కూల్ రూప్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.
ఈ విధానం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. కూల్ రూఫ్ వల్ల మీటర్ కు కేవలం రూ.300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. దీనివల్ల కరెంట్ వాడకం తగ్గి ఆ మేరకు బిల్లు కూడా తక్కువ వస్తుందని, కూల్ రూఫ్ కు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని వివరించారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి ప్రభుత్వం (Govt)తరఫున శిక్షణ అందిస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి కూల్ రూఫ్ కు ఉపయోగిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.