»Ram Charans Wife Upasana Kamineni Posts Her Grand Baby Shower Photos
దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాసన Baby Shower పార్టీ
తాను అందంగా లేనని.. కేవలం డబ్బుల కోసమే చరణ్ తనను వివాహం చేసుకున్నాడని మొదట్లో చాలా విమర్శలు వచ్చాయని ఉప్పి పేర్కొంది. కానీ అవన్నీ నిజం కాదని ఇప్పుడు వారికి తెలిసిందని చెప్పింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ (Ram Charan Teja) భార్య ఉపాసనతో (Upasana) కలిసి దుబాయ్ (Dubai)లో ప్రశాంతంగా గడుపుతున్నారు. వారు ప్రస్తుతం జీవితంలోని మధురానుభూతి రోజులు పొందుతున్నారు. పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నారు. గర్భిణిగా ఉన్న ఉపాసనను వీలైనంత సంతోషంగా ఉంచుకునేలా చరణ్ జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా, వ్యాపార పనులు పక్కన పడేసి దుబాయ్ లో చెర్రీ దంపతులు సేద తీరుతున్నారు. తాజాగా ఉపాసన బేబీ షవర్ (Baby Shower) వేడుక దుబాయ్ లోనే జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకుంది.
దుబాయ్ లోని నమ్మోస్ బీచ్ క్లబ్ (Nammos Mykonos Beach Club)లో ఉపాసన బేబీ షవర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మంది స్నేహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన విషయాలను ఉపాసన ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో పంచుకుంది. ‘మీ అందరి ప్రేమకు చాలా ధన్యవాదాలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా ప్రియమైన సోదరీమణులకు చాలా థ్యాంక్స్’ అంటూ పోస్టు చేసింది. ప్రస్తుతం చరణ్ శంకర్ (Shanker) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer Movie) సినిమా చేస్తున్నాడు. ఇటీవల కొంత షూటింగ్ పూర్తి కాగా చరణ్ దుబాయ్ పర్యటన పూర్తయ్యాక మిగతా షూటింగ్ జరుగనుంది. కాగా ఇటీవల చరణ్ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తోపాటు ఇతర సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల చరణ్ తో పెళ్లి విషయమై ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నది. తాను అందంగా లేనని.. కేవలం డబ్బుల కోసమే చరణ్ తనను వివాహం చేసుకున్నాడని మొదట్లో చాలా విమర్శలు వచ్చాయని ఉప్పి పేర్కొంది. కానీ అవన్నీ నిజం కాదని ఇప్పుడు వారికి తెలిసిందని చెప్పింది. ప్రస్తుతం తాను చెర్రీ సంతోషంగా ఉన్నామని వెల్లడించింది. 12 జూన్ 2012లో చరణ్, ఉపాసన పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.