టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) ఒకరు. రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు తనలోని ఫ్యాషన్ సెన్స్ ని బయటకు తీస్తూ ఉంటుంది. తాజగా బికినీలో మెరిసింది. అసలే సమ్మర్ వేడి అంటే, ఇలా రకుల్ బికినీలో కనిపించి మరింత చెమటలు పట్టేలా చేయడం విశేషం.
రకుల్ ప్రీత్ వేసవి సెలవుల కోసం బీచ్ కి వెళ్లింది. ఇక అక్కడ ఆ అందాలను ఆస్వాదిస్తూ.. తన అందాల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె వేసవిలో ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ వెళ్లింది.
అక్కడ బీచ్ లో తడుస్తూ, ఇసుకలో ఆడుకుంటూ ఆ ఫోటోలను ఆమె షేర్ చేసింది. పసుపు రంగు బికినీ ఆమె ధరించడం విశేషం. తలకు టోపీ కూడా పెట్టడంతో స్టైలిష్ గా కనపడుతోంది.
ఆమె చిత్రాలకు ‘చిర్పీ అండ్ హ్యాపీ 💛💛💛’ అని క్యాప్షన్ ఇవ్వడంతో పాటు మాల్దీవుల్లో ఉన్న రిసార్ట్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది. ట్రిప్ మొదలైన వెంటనే బికినీలో పిక్స్ పెట్టింది. టూర్ అయిపోయే సమయానికి ఇంకా ఎన్ని ఇలాంటి పిక్స్ షేర్ చేస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం రకుల్ చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. వరసగా ప్లాప్ లు రావడంతో బాలీవుడ్ లోనూ అవకాశాలు తగ్గాయి. రీసెంట్ గా ఓ తమిళ సినిమాలో అవకాశం లభించినట్లు తెలుస్తోంది.
దీంతో, మళ్లీ ఈ సినిమాతో దక్షిణాది జనాలకు రకుల్ దగ్గరయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి దక్షిణాదిన రకుల్ కమ్ బ్యాక్ ఎలా ఉంటుందో.