»Rajasthan He Beat Me To Death Saying That I Am Shiva I Will Live Again
Viral News: నేను శివున్ని..మళ్లీ బతికిస్తా అంటూ కొట్టి చంపాడు
తాగిన మత్తులో ఓ వ్యక్తి దారణానికి ఒడిగట్టాడు. తానే శివుడినని..తిరిగి బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హతమార్చాడు. ఈ సంఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీశారు. అయితే అతను ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చుద్దాం.
Rajasthan, he beat me to death saying that I am Shiva.. I will live again
Viral News: మూఢనమ్మకాలకు తోడు మద్యం మత్తు. ఇంకేముంది పిచ్చి ముదిరి ఎక్కువైంది. తానే దేవుడంటూ(God) ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా ఓ అభాగ్యురాలిని పొట్టనపెట్టుకున్నాడు. తిరిగి జీవం పోస్తానని చెప్పి ఓ వృద్ధురాలిని కొట్టి చంపేశాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆ దృశ్యాన్ని ఫోన్లో(Mobile) చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని ఉదయ్‌పుర్ జిల్లా గోగుండా తహసీల్ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం తాగిన ప్రతాప్‌సింగ్ (70) తాను శివుడి అవతారమని.. తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతానని ఊగిపోయాడు. ఇంతలో అతనికి ఎదురుగా కల్కిబాయ్ గమేతి (85) అనే వృద్ధురాలు కనిపించింది. ఆమెను పిలిచి, ఉపదేశిస్తున్నట్టు నువ్వు మహరాణివి.. ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ సమయంలో ఇక్కడ ఉండవు. చాలా అదృష్టవంతురాలివని నిన్ను చంపి మళ్లీ బతికిస్తానని ప్రగల్బాలు పలికాడు. ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆమెపై దాడి చేయడం ప్రారంభించాడు.
ఆ సమయంలో అతని పక్కనే ఇద్దరు మైనర్లతో పాటు నాథూసింగ్ అనే మరో వ్యక్తి అక్కడే ఉన్నారు. వారిలో ఒకరు దాడి దృశ్యాలను వీడియో తీశారు. ముందు ఆమె ఛాతీపై బలంగా చేతులతో కొట్టాడు. వృద్ధురాలు బరించలేక కిందపడిపోయింది. వెంటనే సదరు వ్యక్తి చేతులో ఉన్న గొడుగుతో చితకబాదాడు. సృహ కోల్పోయినా తను కొడుతూనే ఉన్నాడు. దీంతో ఆమె బరించలేక చివరిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఉండేది ఆదివాసీలు ఎక్కువగా నివసించే కొండ ప్రాంతమని, మద్యం తాగిన ప్రతాప్‌సింగ్‌కు సమీపంలోని ఇంటికి వృద్ధురాలు నడుచుకొంటూ వెళ్తుండగా అతనికి తారసపడిందిని పోలీసులు చెప్పారు. అనుమానితులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఉదయ్‌పూర్ ఎస్పీ భువన్ భూషణ్ చెప్పారు.