»Tsrtc Bill Pass Legislature Approval Of Rtc Employees Merger Bill Celebration Among Workers
TSRTC Bill Pass: ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం..కార్మికుల్లో సంబరాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో కూడా అందరూ ఆమోదం తెలుపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ(Telangana) రాష్ట్ర రవాణా సంస్థ (TSRTC) ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపడంతో కార్మికుల్లో సంబరాలు మొదలయ్యాయి. గవర్నర్ తమిళిసై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎటువంటి పరిస్థితిలో సంస్థను ప్రభుత్వం విలీనం చేయాల్సి వస్తున్నదో వివరించారు. గవర్నర్ తమిళిసై సైతం తెలిసీతెలియక అనవసరంగా మాట్లాడి వివాదం కొనితెచ్చుకున్నారన్నారు. కాలక్రమేణా ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోయిందని, ప్రస్తుతం ఆ నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీంతో రూ.14 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ దూసుకుపోతోందన్నారు.