హైదరాబాద్(hyderabad)లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం(rain)తో ప్రజలు(people) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల డ్రైనేజీ హోల్స్, గుంతల కారణంగా నాలాలు(overflowing canal) పొంగిపొర్లుతున్నాయి. ఇక భాగ్యనగరంలో వర్షం వస్తే కరెంట్ పోవడం(power cut problems) సర్వసాధారణం అయిపోయింది.
హైదరాబాద్లో వర్షం(hyderabad rain) కురిస్తే చాలు…అనేక ప్రాంతాల్లో ప్రజలు(people) భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోతున్నాయి. మరోవైపు రోడ్లపైకి నీరు చేరి అనేక ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇంకొన్నిచోట్ల రోడ్లపైనే నాలాలు(overflowing canal) పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై(roads) ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనాలు రోడ్లపై వెళ్లాలంటే ఎక్కడ ఏ గుంత ఉందో తెలియని పరిస్థితిగా మారింది. పలు చోట్ల డ్రైనేజీ హోల్స్, గుంతల కారణంగా కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు భాగ్యనగరంలో వర్షం పడితే అనేక చోట్ల కరెంట్(power cut problems) పోవడం సర్వసాధారణంగా మారిపోయింది. నిన్న రాత్రి బోరబండ, కూకట్ పల్లి, మాసబ్ ట్యాంక్ సహా అనేక చోట్ల కరెంట్ పోయింది. ఉదయం వరకు కూడా కరెంట్ రాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు(People trouble)ఎదుర్కొన్నారు. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనేతే ఇళ్లలోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దీంతో ఇంట్లో సామాగ్రి తడిసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో నీరు మొకాళ్ల లోతు వరకు చేరి నడిచే ప్రజలు అవస్థలు పడుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా కూడా…హైదరాబాద్(hyderabad) పరిస్థితి మాత్రం మారడం లేదు. అదే పాతకాలపై డ్రైనేజ్ వ్యవస్థతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పాటి వర్షం వస్తే చాలు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు మొదలవుతున్నాయి. మరోవైపు పలుచోట్ల ఆక్రమించిన చెరువులు, నాలాల ఆక్రమణలే వరద ముంపునకు కారణమని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా నిధులు ఉపయోగించకపోవడం వల్లే హైదరాబాద్ ఇలా తయారువుతుందని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వరదలపై స్థానికులు(local people) తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.