»President Draupadi Murmu Flew In A Sukhoi Fighter Jet
Sukhoi 30 MKI: ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనివారం అస్సాం(Assam)లోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్(Tezpur Air Force Station) నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుంచి 30 నిమిషాల విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ఫ్లయింగ్ సూట్లో కనిపించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనివారం అరుదైన ఘనతను సాధించారు. రాష్ట్రపతి అయిన తర్వాత సుఖోయ్-30 ఎంకేఐ విమానంలో ప్రయాణం చేసిన రెండో మహిళా అధ్యక్షురాలిగా ముర్ము రికార్డు సృష్టించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2009లో పూణె ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. అయితే ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన సుఖోయ్-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించడం తనకు చాలా సంతోషకరమైన అనుభవమని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇది భూమి, గగనతలం, సముద్రం సహా అన్ని సరిహద్దులను కవర్ చేస్తుందని కొనయాడారు. ఈ నేపథ్యంలో సుఖోయ్ యుద్ధ విమానం భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
President Droupadi Murmu took a historic sortie in a Sukhoi 30 MKI fighter aircraft at the Tezpur Air Force Station in Assam. President Murmu is the third President and second woman President to undertake such a sortie. pic.twitter.com/DozRAWm3Yp
— President of India (@rashtrapatibhvn) April 8, 2023
భారత సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి దాదాపు 30 నిమిషాల పాటు విమాన ప్రయాణం చేశారు. అస్సాం(assam)లోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్(tezpur Air Force Station)లో సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ మేరకు చారిత్రాత్మకంగా ప్రయాణించారు. ఆమె ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు తిరిగి వచ్చే ముందు హిమాలయన్ వ్యూతో పాటు బ్రహ్మపుత్ర, తేజ్‌పూర్ లోయలను కూడా కవర్ చేశారు. 106 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ ఈ విమానాన్ని నడిపారు. ఈ విమానం సముద్ర మట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. మార్చి 2023లో రాష్ట్రపతి ముర్ము INS విక్రాంత్‌ను సందర్శించారు. ఆ క్రమంలో అధికారులు, నావికులతో సంభాషించారు.
అయితే సుఖోయ్-30 MKI అనేది రష్యాకు చెందిన సుఖోయ్ అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ మల్టీరోల్ ఫైటర్ జెట్. దీనిని భారతదేశానికి చెందిన ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో తయారు చేయబడింది.