పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫేస్బుక్ (Facebook) అకౌంట్ హ్యాక్ (Hack) అయ్యింది. గురువారం సాయంత్రం ఆయన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ వీడియో వైరల్ (Video Viral) అయ్యింది. ఆ వీడియోలో మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ ఉంది. ఆ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans), నెటిజన్లు చూడటంతో అలర్ట్ అయ్యారు. ప్రభాస్ ఫేస్బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు ట్వీట్స్ (Tweets) చేశారు.
ఫేస్బుక్ ఖాతా (Facebook Account) హ్యాకింగ్(Hacking)పై ప్రభాస్ టీమ్ రంగంలోకి దిగింది. కొంత సమయంలోనే సాంకేతిక టీమ్ ఆ సమస్యను పరిష్కరించింది. పదేళ్ల క్రితం ఫేస్ బుక్ ఖాతాను ప్రభాస్ (Prabhas) ఓపెన్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు (Followers) ఉన్నారు. అయితే ప్రభాస్ మాత్రం కేవలం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)ని మాత్రమే ఫాలో అవుతున్నారు.