Ponguleti : తాను ఏ పార్టీ మారినా... తన ఎజెండా మాత్రం ఒకటేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన బీఆర్ఎస్ ని వీడాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లాలి అనే విషయంలో ఆయనకు ఇంకా క్లారిటీ రాలేదు.
తాను ఏ పార్టీ మారినా… తన ఎజెండా మాత్రం ఒకటేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన బీఆర్ఎస్ ని వీడాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే… ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లాలి అనే విషయంలో ఆయనకు ఇంకా క్లారిటీ రాలేదు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పొంగులేటి తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్నమొన్నటి వరకూ బీజేపీలో పొంగులేటి చేరడం లాంచనమే అన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయమై ఏటూ తేల్చుకులేకపోతున్నట్లు సమాచారం.
తన రాజకీయ భవిష్యత్ పై పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాలేరులో పొంగులేటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైందని విమర్శించారు. ఉపాధి అవకాశాలు లేవన్నారు. రైతులకు రుణ మాఫీ అమలు కాలేదన్నారు. డబుల్ బెడ్ రూంలు నిర్మాణం జరగలేదన్నారు. మరోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ తోనూ పొంగులేటి భేటీ అయ్యారు. అన్ని పార్టీల నేతలతోనూ చర్చలు జరుపుతున్న ఆయన ఏ పార్టీలో చేరాలో తేల్చోకోలేకపొతున్నారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
పార్టీ మరీనా తన ఎజెండా ఒక్కటే ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అని తెలిపారు. రాజకీయంగా నిర్ణయం తీసుకునే సమయంలో ఖచ్చితంగా ఏ పార్టీలోకి వెళతానన్నది ప్రకటిస్తానని పొంగులేటి అన్నారు. జెండా ఏదైనా తన అజెండా కు మాత్రం కట్టుబడుతానని తెలిపారు. కేసీఆర్ విషయంలో ప్రజలు రెండు సార్లు మోసపోయారని..మూడోసారి ఎవరు మోసపోతారో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ప్రకటించినట్లుగా నిధుల కేటాయింపులు జరగడం లేదని పొంగులేటి అన్నారు.