ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ న్యూస్.. ఆ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది.
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ రోజు హసన్‌లో నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించారు. ఆమూల్ బ్రాండ్ కన్నా.. నందిని మంచి బ్రాండ్ అని చెప్పుకొచ్చారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఏప్రిల్ 15వ తేది నుంచి జూన్ 14వ తేది వరకూ కూడా ఏపీలో చేపల వేట(Fishing)పై నిషేధం ఉండనుంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ నిషేధం అనేది యాంత్రిక, మోటారు బోట్లకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. 61 రోజుల పాటు వీరంతా చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశించింది.
తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు
TSPSC స్కాం సహా ఇతర భూ స్కాంల ద్వారా సీఎం కేసీఆర్(CM KCR) లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. అలా వచ్చిన డబ్బును ఇతర రాష్ట్రాల సీఎంలకు ఇచ్చి తాను ప్రధాని కావాలని కలలు కన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాఫియా మోడల్ పాలన చేస్తున్న కేసీఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Niharika Divorce : సినిమా ఇండస్ట్రీలో విడాకులు కామన్. సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. నాగ చైతన్య, సమంత.. ధనుష్, ఐశ్వర్య.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా షాక్ గురి చేసిన విడాకులు అని చెప్పొచ్చు. అయితే హీరో, హీరోయిన్లు అంటే మ్యాటర్ వేరే ఉంటది.
జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ అంశంలో అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిందని చెబుతున్న తన మొబైల్.. సీఎం కేసీఆర్ వద్ద ఉందని చెప్పారు.
కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఓ మలయాళ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి ఆజాద్ షాకింగ్ అంశాలు వెలుగులోకి తెచ్చారు.
బాలీవుడ్ హీరోలు.. మన హీరోలను గెస్ట్ రోల్ కోసం సంప్రదిస్తున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్ మూవీలో గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
భాగ్యనగరానికి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రానుంది. హైదరాబాద్ - బెంగళూరు మధ్య కొత్త రైలును నడపాలని చూస్తున్నట్లుగా సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(bandi sanjay) బలగం(balagam) మూవీని ఈరోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో(devi theatre hyderabad) వీక్షించారు. ఈ చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో బండి సంజయ్ పలువురు కార్యకర్తలతో కలిసి సినిమాను చూశారు.
స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.