తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వైస్ ఛాన్స్ లర్ రవీందర్ పై ఏసీబీ విచారణకు తీర్మానించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ గా పనిచేసిన ప్రొఫెసర్ పై వేటు పడింది. దీంతో ఇంఛార్జీ రిజిస్ట్రార్ హోదాలో అతను తీసుకున్న నిర్ణయాలపై పాలక మండలి విచారణకు ఆదేశించింది.