నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కు ప్రమాదం జరిగింది. తన రాబోయే చిత్రం విలయత్ బుద్ధ షూటింగ్ కొచ్చిన్‌లోని మరయూర్‌లో జరుగుతుండగా చోటుచేసుకుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా, నటుడి కాలికి గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పలు చోట్ల ఆకస్మికంగా వరదలు సంభవించాయి. దీంతో పలు చోట్ల 200 మందికిపైగా టూరిస్టులు, స్థానికులు చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.
క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. అయితే బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేసిన తర్వాత చెమటలు పట్టడం వల్ల కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా? అవును ఎక్కువ చెమట పట్టడం వల్ల జుట్టు దెబ్బతింటుందని(Hair loss) నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.
మూలధన వ్యయం ఖర్చు చేయడంలో ఏపీ చివరి స్థానంలో నిలిచింది. 25 రాష్ట్రాలతో కూడిన జాబితాను బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ఏపీ లాస్ట్ ప్లేస్‌లో ఉంది.
ప్రముఖ పశుపతినాథ్ ఆలయం(pashupatinath temple)లో 10 కిలోల బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు ఏలా పోయిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు.
ఈరోజు(june 26th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
జనసేన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై చేయి పడినా, రాయి పడినా ఊరుకునేది లేదని, తన్ని తగలేస్తానని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ విడత రైతుబంధు నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా 70 లక్షల మంది ఖాతాల్లో నగదు జమకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో తొలిసారి సరోగసీ ద్వారా ఓ దూడ జన్మించింది. తిరుపతి వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ప్రాసెస్ చేయగా విజయవంతంగా దూడ జన్మించింది. ఈ పద్దతిలో మరో ఐదేళ్లలో 500 దూడలను పుట్టించనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.
కేపీ చౌదరి డ్రగ్స్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని నటి జ్యోతి, సురేఖా వాణిలు వీడియోలు రిలీజ్ చేశారు. తమను ఈ కేసులోకి లాగొద్దని తెలిపారు.
ఏపీలో నెల్లూరు పాలిటిక్స్ హీటెక్కాయి. ఆనంరాంనారాయణ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.
సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు గుబులు రేపుతోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఆయన కాంటాక్ట్స్ లిస్ట్ పరిశీలించారు. తాను 12 మందికి కొకైన్ అమ్మినట్లు కేపీ చౌదరి అంగీకరించడంతో పోలీసులు ఆ 12 మందికి నోటీసులు పంపారు.
హైదరాబాద్(hyderabad) కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రాంతంలో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. ప్రమాదశాత్తు ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె(project k)' ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ ఈ మేరకు ప్రకటించారు.