తెలంగాణలో ఉన్నత విద్యపై బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. బీటెక్ కాలేజీలలో విద్యార్థుల ఫీజు(fees) లక్ష రూపాయలకుపైగా ఉంటే..ప్రభుత్వం కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ, ఓసీ విద్యార్థులు ఆ ఫీజులు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అలాగే వీటిని ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు అనే విషయాలపై డాక్టర్ సీఎల్ వెంకట్ రావు చక్కటి వివరణ ఇచ్చారు.
బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకం సృష్టించారు. అదే పార్టీకి చెందిన కార్యకర్తతోపాటు అతని ఫ్యామిలీపై దాడి చేశారు. ఆ క్రమంలో సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఎట్టకేలకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ(Old City) చార్మినార్ కు మెట్రో(metro) రాబోతుంది. ట్రాఫిక్ కష్టాలతోపాటు చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ పనులను ఇప్పటికే ప్రారంభించామని తాజాగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
రాజాం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి(government teacher) హత్య(murder) కేసులో విజయనగరం పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ హత్యకు గల కారణాలను జిల్లా ఎస్పీ దీపిక వెల్లడించారు.
24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 8వ వింబుల్డన్ టైటిల్ కోసం ఆడిన నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు నిన్న షాక్ ఎదురైంది. 20 ఏళ్ల స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జకోవిచ్‌ను మట్టికరిపించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్నాడు.
ఈరోజు(july 17th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
కర్నూలులో ఓ మహిళకు లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది. చాలా రోజుల నుంచి రంగు రాళ్ల కోసం వెతుకుతున్న ఆ మహిళకు పొలంలో ఆ వజ్రం లభించింది.
బేబీ మూవీ విడుదల తర్వాత మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మీడియా నుంచి బోల్డ్ సీన్స్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటికి ఆమె ధీటుగా ఆన్సార్ చేయడం విశేషం.
ఆన్‌లైన్ వీడియోల ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఇండో-కెనడియన్ సింగర్ జోనితా గాంధీ. తన పాటలతోపాటు తన అందాలతో కూడా కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తుంది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఈరోజు 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం తర్వాత అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. భూకంపం 9.3 కి.మీ (5.78 మైళ్లు) లోతులో ఉన్నట్లు యుఎస్‌జిఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు కెనడియన్ పసిఫిక్ తీరాలకు, సునామీ ప్రమాదం ముప్పు ఉంటుందని అంచనా వేశారు.
రష్మిక, భీష్మ కాంబోపై వచ్చిన రూమర్స్ మూవీ మేకర్స్ కొట్టిపారేశారు. నితిన్, వెంకీ కుడుముల నుంచి రష్మిక మందన్న(Rashmika mandanna) తప్పుకున్నట్లు ఇటీవల వచ్చిన పుకార్లు నిజం కాదని తెలిపారు.
దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్‌లో వెస్ట్ జోన్‌పై సౌత్ జోన్ 75 పరుగుల తేడాతో దులీప్ ట్రోఫీని గెలుచుకుంది.
దక్షిణ కొరియా(south korea)లో భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన సొరంగం కింద చిక్కుకున్న వారి కోసం సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీయగా మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
యువకులు ఫుడ్ ఛాలెంజ్ చేసే విషయంలో జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే పరిమితికి మించి తినడం వల్ల అనార్థాలతోపాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటివల బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో చోటుచేసుకుంది.