కర్నూలు(Kurnool)లో వజ్రాల వేట సాగుతోంది. తొలకరి జల్లులు పడితే చాలు తరచూ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు(Diamonds) బయటపడుతూనే ఉంటాయి. రంగు రాళ్ల కోసం అక్కడి ప్రజలతో పాటు బయట వ్యక్తులు కూడా వెతుకుతూ ఉంటారు. వజ్రాల వేటలో బిజీగా ఉండటం ఎప్పుడూ జరుగుతూ ఉండే విషయమే. అయితే తాజాగా ఓ మహిళకు లక్ష్మీదేవి కటాక్షించింది. తొలకరి వానలు పడటంతో చాలా మంది వజ్రాల కోసం పోటాపోటీగా వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో రంగు రాళ్ల కోసం వెతుకుతున్న ఓ మహిళకు వజ్రం దొరికింది.
మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన మహిళా రైతుకు వజ్రం(Diamond) దొరికింది. దాని విలువ కొన్ని లక్షలు ఉంటుందని స్థానికుల సమాచారం. అయితే ఆ మహిళ తనకు దొరికిన వజ్రాన్ని జొన్నగిరికి చెందిన ఓ వజ్రాల వ్యాపారికి అమ్మింది. ఆ వజ్రాల వ్యాపారి 14 లక్షలు రూపాయలు నగదు, నాలుగు తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశాడు.
కర్నూలు జిల్లాల్లో స్థానికులే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి వజ్రాల(Diamonds) వేట కోసం వచ్చి వెతుకులాట మొదలుపెడతారు. ఒక్క వజ్రమైనా దొరక్కపొదా అనే ఆశతో చాలా కాలం పాటు వెతుకుతూనే ఉన్నవారు ఉన్నారు. వెతుకులాటలో వారికి మెరుస్తూ ఉన్న రాయి(colourful Stones) కనిపిస్తే చాలు వజ్రాల వ్యాపారి దగ్గరకు పరుగులు తీసి దానిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ ఉంటారు.