»Package Star Pawan Kalyan Criticism According To Chandrababus Scriptcm Jagan
CM jagan:బాబు స్క్రిప్ట్ ప్రకారమే ప్యాకేజీ స్టార్ యాక్షన్: సీఎం జగన్
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం.. రెండు సినిమాలకు మధ్య గ్యాప్‌లో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసి పవన్ కల్యాణ్ వెళ్లిపోతారని ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.
Package star Pawan Kalyan criticism according to Chandrababu's script:CM jagan
CM jagan:ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) సీఎం జగన్ (CM jagan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేనానికి దశ, దిశ లేదని ధ్వజమెత్తారు. రెండు సినిమాలకు మధ్య షూటింగ్ గ్యాప్‌లో పవన్ (pawan kalyan) పొలిటికల్ మీటింగ్ పెడతారని గుర్తుచేశారు. అంతే తప్పు వీలు చూసుకొని ప్రజల వద్దకు రారని చెప్పారు. అదీ కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారం మాత్రమే మాట్లాడతారని చెప్పారు. నాలుగు మాటలు మాట్లాడి.. వెంటనే వెళ్లిపోతారు ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) అని సీఎం జగన్ (CM jagan) విమర్శలు గుప్పించారు. అలాంటి వీరికి ప్రజా జీవితం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM jagan) మాట్లాడారు.
దత్తతండ్రి, దత్తపుత్రుడు (pawan kalyan) అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్లో ఫైరయ్యారు సీఎం జగన్ (CM jagan). చంద్రబాబు, పవన్.. అధికారంలో ఉంటే అమరావతి.. లేదంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉంటారని గుర్తుచేశారు. వీరికి ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ లేదని చెప్పారు. తాను మాత్రం అలా కాదని చెప్పారు. విపక్ష నేతగా ఉన్నప్పుడే అమరావతిలో ఇళ్లు నిర్మించుకున్నానని గుర్తుచేశారు.
చంద్రబాబు మాత్రం సీఎంగా ఉండగా జూబ్లీహిల్స్‌లో ఇళ్లు కట్టుకున్నారని జగన్ ( jagan)గుర్తుచేశారు. ఏపీలో దోచుకుని.. హైదరాబాద్‌లో నివాసం ఉండటమే దత్తపుత్రుడు (pawan kalyan).. దత్తతండ్రి సిద్దాంతం అని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. దత్తపుత్రుడు, దత్త తండ్రి మాత్రం పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులను నమ్ముకున్నారని జగన్ తెలిపారు. వారికి.. తనకు మధ్య తేడా ఇదేనని చెప్పారు.