యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ అయిపోయింది.. కానీ కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమాలు రిలీజై నెలలు గడుస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మరోసారి ఎన్టీఆర్30 అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా అప్టేట్ ఏమి లేవు.
కొరటాల కూడా ఎక్కడా కనిపించలేదు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా గురించి ఎలాంటి అప్టేట్స్ ఇవ్వలేదు. దాంతో ఎన్టీఆర్ 30 పై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా కొరటాల సీరియస్ డిస్కషన్స్‌లో ఉన్న ఫోటో ఒకటి బయటికి రావడంతో.. ఎన్టీఆర్ 30 పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో కొరటాల చర్చిస్తున్న ఫొటోలు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొరటాల అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. దాంతో త్వరలోనే షూటింగ్ అప్టేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను డిసెంబర్లో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.