»Nothing For Bjp To Hide Or Be Afraid Of Amit Shah Dares Congress To Move Court On Adani Issue
Amit Shah : కోర్టుకు వెళ్లండి… కాంగ్రెస్ కి అమిత్ షా సవాలు…!
Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
బిలియనీర్ గౌతమ్ అదానీని బీజేపీ వెనకేసుకు వస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ దీనిపై మేము ఏదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మేం భయపడే ప్రసక్తే లేదు.. మీరు కోర్టులకెక్కవచ్చు అని ఛాలెంజ్ చేశారు.
అదానీ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న కారణంగా ఈ వివాదంపై తాను మరింత వ్యాఖ్యానించడం సమంజసం కాదని, కోర్టు దీనిపై తన అభిప్రాయం చెబుతుందని అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీకి అదానీ స్నేహితుడని, మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి అదానీ ఆస్తుల విలువ పెరిగిపోతూ వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే ఆరోపించిన నేపథ్యంలో మొదటిసారిగా అమిత్ షా దీనిపై ఇలా స్పందించారు.