రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోను తగ్గేదేలే అంటున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ‘అఖండ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య.. అన్ స్టాపబుల్ షోతో డబుల్ డోస్ ఇస్తున్నారు. ఇక అంతకుమించి అనేలా ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జనవరి 12న రిలీజ్ కాబోతోంది. దాంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108 ప్రాజెక్ట్ చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన ఈ సినిమాను.. డిసెంబరు 8న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఆ ఆ తర్వాత 12 రోజుల్లోనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయనున్నారట.. అయితే ముందుగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేశారట. ఇక ఈ సినిమాలో పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల.. బాలయ్య కూతురిగా నటించనుంది. అయితే హీరోయిన్ విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. టాక్సీవాలా, ఎస్.ఆర్.కళ్యాణ మండపం సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌ను ఫైనల్ చేసినట్టు టాక్. రీసెంట్గా ప్రియాంక ఫొటోషూట్‌లో కూడా పాల్గొందని సమాచారం. అయితే NBK 108లో ఆమె మెయిన్ హీరోయినా.. లేక సెకండ్ హీరోయినా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అమ్మడికి బాలయ్యతో ఛాన్స్ వస్తే మాత్రం.. బంపర్ ఆఫర్ కొట్టేసినట్టేనని చెప్పొచ్చు.