Minister Daishetty Raja : పవన్ ఎమోషనల్ బ్లాక్ మొయిల్ చేస్తున్నారు…
Minister Daishetty Raja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు, మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ అధ్యక్షతన మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరుగబోతోంది. ఈ సభ నేపథ్యంలో పవన్ నాలుగు రోజుల ముందే... విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో... పవన్ పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు, మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ అధ్యక్షతన మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరుగబోతోంది. ఈ సభ నేపథ్యంలో పవన్ నాలుగు రోజుల ముందే… విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో… పవన్ పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు.
మూడు నెలల తర్వాత… పవన్ బయటకు వచ్చి హడావిడి చేస్తున్నారంటూ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకీ మోయడమేనా అని వ్యాఖ్యలు చేశారు.
కొత్తగా చంద్రబాబుతో కలిసి ఉన్నట్లు పవన్ మాట్లాడుతున్నారన్నారు. 2014 నుంచి చంద్రబాబు తో పవన్ కలిసే ఉన్నారని స్పష్టం చేశారు. పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, చంద్రబాబుకు కాపులు ఓటేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ మాట్లాడుతున్నారని అన్నారు.
ఈనెల 14న పవన్ యాక్టింగ్‌ను బట్టి అతని ప్యాకేజ్ ఉంటుందన్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని తెలిపిన మంత్రి.. ఈనెల 14న నాటు నాటు పాటకు మించి పవన్ డాన్సు ఉంటుందని.. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ రేపు పవన్ చదువుతారని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ఆర్కు వచ్చిన ఆస్కార్ కంటే పవన్ యాక్టింగే ఆస్కార్ ఉండబోతోందన్నారు.