»Man Raises Concern For Indian Construction Workers Risking Safety In Viral Video
Viral Video: నాకైతే భయం వేసిందన్న క్రికెట్ జర్నలిస్ట్
మన దేశంతో పాటు వివిధ దేశాల్లో చాలామంది భవన నిర్మాణ కార్మికులు తగినంత భద్రతా చర్యలు లేకుండానే పని చేస్తుండటం అసాధారణమేమీ కాదు. తరుచూ ఎక్కడో ఓ చోట ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. కార్మికులు చాలామంది సరైన ప్రోటోకాల్ లేదా భద్రతా చర్యలు లేకుండానే ఎత్తైన భవనాల నుండి ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తుంటారు.
మన దేశంతో పాటు వివిధ దేశాల్లో చాలామంది భవన నిర్మాణ కార్మికులు (Building Workers) తగినంత భద్రతా చర్యలు లేకుండానే పని చేస్తుండటం అసాధారణమేమీ కాదు. తరుచూ ఎక్కడో ఓ చోట ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. కార్మికులు చాలామంది సరైన ప్రోటోకాల్ లేదా భద్రతా చర్యలు (Security) లేకుండానే ఎత్తైన భవనాల నుండి ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తుంటారు. తాజాగా ఓ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఇది ప్రమాదకర పరిస్థితుల వాస్తవికతను కళ్లకు కట్టింది. ఆన్ లైన్ లో భవన నిర్మాణ కార్మికుల భద్రతా చర్యల పైన మరోసారి సోషల్ మీడియాలో (Social Media) చర్చ సాగేలా చేస్తోంది.
పీటర్ లాలర్ అనే క్రికెట్ జర్నలిస్ట్ (Cricket Journalist) ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను (Video on Twitter) షేర్ చేశారు. ఇందులో భవన నిర్మాణ కార్మికుల (Building Workers in India) కోసం తీసుకున్న భద్రతా చర్యల పైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీడియోలో ఓ కార్మికుడు ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే స్లాబ్ నుండి అతిపెద్ద ఇనుప నిచ్చెన వంటి సాధనం పైకి వచ్చి.. పైన ఉన్న మరో కార్మికుడికి నిర్మాణ సామాగ్రిని పంపిస్తున్నాడు. అతను తన తొమ్మిదో అంతస్తులో ఉన్న వ్యక్తికి దానిని పంపిస్తున్నాడు. అతను కూడా చాలా ఎత్తులో ఉన్నాడు. ఇది భయాన్ని కలిగిస్తోంది. కానీ సదరు కార్మికుడు ధైర్యంగా తన పనిని నిర్వర్తించాడు. అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే భద్రతా చర్యల కోసం డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చిందని పీటర్ లాలర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
‘భారత భవన నిర్మాణ కార్మికులు అద్భుతమైన దైర్యవంతులు. అయితే వారికి తగినంత భద్రతను డిమాండ్ చేయడానికి యూనియన్ అవసరమని నేను భావిస్తున్నాను. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి’ అని పేర్కొన్నారు. మరో వీడియోను కూడా పోస్ట్ చేశాడు పీటర్. అందులోను అతని భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తనను భయానికి గురి చేస్తుందన్నారు. ఇలాంటి భవనాలు నిర్మించే వారు కార్మికులకు కాస్త తగినంత భద్రతను కల్పించాలని, కనీసం తాడు ఏర్పాటు చేయాలని సూచించారు.
The poor bloke is going to be doing this all day. I’m scared for him. You’d think the people who build these places could afford some safety. A rope to secure him at least. https://t.co/P2ySUEiUy6pic.twitter.com/VAENytyb6w