మధ్య్రప్రదేశ్(madhya pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి వేడుకలను నిర్వహించుకునేందుకు నగరాల నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా కూలీలుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయం సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల నుంచి బయటపడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేవా ప్రాంతంలో జరిగిన ప్రమాదంపై మంత్రులు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.