»Ktr Responds Indirectly On Teenmar Mallanna Arrest
KTR: మేం కూడా అలా చేయాలేమో… తీన్మార్ మల్లన్న అరెస్ట్‌పై పరోక్షంగా కేటీఆర్
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషాలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నప్పటికీ ఓపికతో సహిస్తున్నామని ట్వీట్ చేశారు. పరుష పదజాలంతో ట్వీట్ చేసినందుకు బీజేపీ పాలిత కర్నాటక రాష్ట్రంలో కన్నడ నటుడు చేతన్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోను అదే తరహా సమాధానం ఇవ్వాలేమోనని ఆయన పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, దూషించే స్వేచ్ఛ కాకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకు అరెస్ట్ చేశారో కేటీఆర్ కు తెలియదా?
కేటీఆర్ ఈ విషయంలో నీతులు చెబుతున్నారని, కానీ ప్రధాని మోడీని మొదలు కాంగ్రెస్ అగ్రనేతల వరకు బీఆర్ఎస్ అనుకూల జర్నలిస్టులు ఇష్టారీతిన మాట్లాడుతుంటే కేటీఆర్ ఏం చేస్తున్నారని, స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళల పట్ల ఇష్టారీతిన మాట్లాడుతుంటే నోరు మెదపలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. నటుడు చేతన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్… ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. సదరు నటుడు ఓ మతాన్ని కించపరిచేలా ట్వీట్ చేశారని, అది వైరల్ గా మారి, పిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారని కేటీఆర్ కు తెలియకపోవడం దారుణం అంటున్నారు.
కేటీఆర్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలుకుతూ,ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ… శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
హైదరాబాద్ కు కవిత, కేటీఆర్
రెండు రోజులు వరుసగా ఈడీ విచారణకు హాజరైన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బుధవారం ఉదయం తన సోదరుడు కేటీఆర్ (Minister KTR), కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ (Hyderabad) బయలుదేరారు. బుధవారం విచారణ లేదని, మళ్లీ ఎప్పుడు విచారణకు రావాలో తెలియజేస్తామని ఈడీ అధికారులు (ED officials) కవితకు చెప్పారు. దీంతో ఆమె హైదరాబాద్ వచ్చారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత రెండు నెంబర్లతోనే పది ఫోన్ లు మార్చినట్లుగా ఈడీ గుర్తించిందని తెలుస్తోంది. 6209999999 నెంబర్ తో ఆరు ఫోన్లు, 8985699999 నెంబర్ తో నాలుగు పోన్లు ఆమె మార్చారని గుర్తించింది. ఈ కుంభకోణంలో కవితతో సహా 36 మంది 70 పోన్లను మార్చారని ఈడీ ఆరోపించింది.