తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు వల్లే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, అలాగే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) కాబోయే ముఖ్యమంత్రి (Chief Minister) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావేనని (KT RamaRao) మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు (KT RamaRao) వల్లే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ పరిశ్రమలు (Industries) తరలి వస్తున్నాయని, అలాగే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో (Investments to Telangana) వస్తున్నాయని చెప్పారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం (international women’s day) సందర్భంగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (palakurthi assembly constituency) తొర్రూరు పట్టణంలో నిర్వహించే సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
మహిళా దినోత్సవం (international women’s day) సందర్భంగా వారి ఆరోగ్యం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీరి కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని (cancer screening test) కేటీఆర్ (KT Ramarao) ప్రారంభిస్తారని, దీనిని మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) సూచించారు. ఒకరోజు ఇక్కడకు వస్తే కూలీ పోతుందని భావించకుండా, అందరూ హాజరు కావాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు దాదాపు 1,300 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు. వేలాది స్వయం సహాయక సంఘాలకు రూ.750 కోట్లు విలువ గల వడ్డీ రాయితీ చెక్కులను మంత్రి కేటీఆర్ అందజేస్తారన్నారు. అలాగే అభయహస్తం పథకం కింద 21,32,482 మంది మహిళలకు వారు చెల్లించిన డబ్బులకు వడ్డీతో సహా దాదాపు రూ.546 కోట్లు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ నెల 8న కేటీఆర్ వరంగల్ జిల్లా ఏనుగల్లు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సభల ఏర్పాట్లను ఎర్రబెల్లి సోమవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడారు.
విజన్ కలిగిన నాయకుడు
విజన్ కలిగిన నాయకుడు మంత్రి కేటీఆర్ అని అని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు (chevella mp constituency) గడ్డం రంజిత్ రెడ్డి (chevella mp ranjith reddy) అన్నారు. ఆయన దూరదృష్టితో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ (United Andhra Pradesh) రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతం అయ్యారని, కేసీఆర్ (K Chandrasekhar rao) పాలనలో రాష్ట్రం (Telangana State) అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. హైదరాబాద్ లో (Hyderabad) ఏళ్ల తరబడి ముంపుతో ఇబ్బంది పడిన కాలనీలకు ఆ సమస్య నుండి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ పార్టీలదే (BRS Party) అన్నారు. ఆయన సోమవారం ఆయన శేరిలింగంపల్లి లోని ఆల్విన్ కాలనీ డివిజన్లో విప్ అరికెపుడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి (chevella mp ranjith reddy) మాట్లాడారు.