Kavitha meet cm kcr:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన తండ్రి సీఎం కేసీఆర్ను (kcr) ఈ రోజు ప్రగతి భవన్లో (pragathi bhavan) కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న కూడా ఈడీ సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ను కలిశారు.

కవిత- కేసీఆర్ భేటీలో మంత్రి కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao) కూడా ఉన్నారు. గత 3 రోజులు ఢిల్లీలో జరిగిన పరిణామాల గురించి కవిత వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ అంశాలను తెలిపారు. అలాగే ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు జరనున్నాయి. దాని గురించి కూడా చర్చ వచ్చింది. రాజకీయంగా బీజేపీని ఎలా ఎదుర్కోవాలి.. న్యాయపరంగా దర్యాప్తు సంస్థలను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై కేసీఆర్ (kcr).. కవితకు (kavitha) సూచనలు ఇస్తున్నారని సమాచారం.
24వ తేదీన సుప్రీంకోర్టులో లిక్కర్ స్కామ్లో కవిత వేసిన పిటిషన్ విచారణ రానుంది. మహిళా హక్కులను ఈడీ కాలరాస్తుందని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను రాత్రి 8 గంటల వరకు ఈడీ కార్యాలయంలో కూర్చొబెట్టడంపై సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాస్తమయం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో ఉంచకూడదని చట్టం చెబుతోందని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి ప్రతీగా ఈడీ కూడా పిటిషన్ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Dehli liquor scam) కవితను (kavitha) నిన్న ఈడీ సుధీర్ఘంగా విచారించింది. ఉదయం 11.30 గంటలకు ఈడీ ఆఫీసుకు రాగా.. రాత్రి 9.40 గంటలకు బయటకు వచ్చారు. 10 గంటల పాటు ప్రశ్నించింది. మొబైల్స్ (mobiles) ధ్వంసం గురించి అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.