Revanth reddy:పేపర్ లీకేజీ (paper leak) అంశం దుమారం రేపుతోంది. కమిషన్ రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.పేపర్ లీక్ కావడంతో (Paper Leak) నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ని టీ.కాంగ్రెస్ నేతలు (T.Congress Leaders) కలిశారు.
Revanth reddy makes sensational comments on paper leak
Revanth reddy:పేపర్ లీకేజీ (paper leak) అంశం దుమారం రేపుతోంది. కమిషన్ రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.పేపర్ లీక్ కావడంతో (Paper Leak) నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ని టీ.కాంగ్రెస్ నేతలు (T.Congress Leaders) కలిశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పేపర్ లీకేజీ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని వివరించారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ (Minister KTR) శాఖ ఉద్యోగులదే కీలకపాత్ర అని రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్‌కు అప్లికేషన్ ఇచ్చామని పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామన్నారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అలా చేస్తేనే.. పారదర్శక విచారణ చేస్తారని భావిస్తామని తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్నారు. కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని ఆయన విమర్శించారు. మంత్రి కేటీఆర్, కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరారు.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడని తెలిసింది. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నారని సమాచారం. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు ఇప్పటికే కూపీ లాగారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.