»India Bloc Nitish Kumar As Convener Of India Bloc
INDIA bloc: ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీశ్ కుమార్?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరవుతున్న వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి జోరు పెంచుతోంది. ఈక్రమంలో విపక్షాల ఇండియా కూటమిలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం.
INDIA bloc: లోక్‌సభ ఎన్నికలు ఆసన్నమవుతున్న వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి జోరు పెంచుతోంది. ఈక్రమంలో విపక్షాల ఇండియా కూటమిలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆయన కూటమి కన్వీనర్‌గా నియమితులు కానున్నారని వార్తలు వస్తున్నాయి. నితీశ్ కుమార్ ఈ నియామకంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత నియామకంపై కూటమిలో మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిగాయి. కీలక పార్టీ అయిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా తనకు మద్దతు ప్రకటించారని సమాచారం.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీని అడ్డుకునేందుకు దేశంలోని ఎన్డీయేతర విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి పేరుతో కలిసికట్టాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడియూ, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి మొదటి సమావేశాన్ని సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో నిర్వహించారు. ఆ తర్వాత బెంగళూరు, ముంభై, ఢిల్లీ వేదికలుగా ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. గతనెల ఈ కూటమి నాలుగో సమావేశం జరిగింది. ఈ భేటిలో విపక్ష కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించారు.